TG: అమ్మ చేతి ముద్ద తినాల్సిన చిరుప్రాయంలో అమ్మకే అమ్మగా మారిన చిన్నారి కథ ఇది. సూర్యాపేట(D) నూతనకల్(M) గుండ్లసింగారంకు చెందిన సలీమాకు కుమారుడు సమీర్, కుమార్తె రిజ్వాన సంతానం. గొడవల కారణంగా తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. శరీరం తీవ్రంగా కాలి మంచానికే పరిమితమైన తల్లిని ఐదో తరగతి చదువుతున్నరిజ్వాన కంటికి రెప్పలా కాపడుకుంటోంది. కదల్లేని స్థితిలో ఉన్న తల్లికి వంటచేసి తినిపించిన తర్వాత బడికి వెళ్తోంది. దాతలు సహకరించి అమ్మకు వైద్యం చేయిస్తే కష్టాల నుంచి బయటపడతామంటూ రిజ్వాన వేడుకుంటోంది.