ప్రముఖ బెంగాలీ నటుడు, నాటక రచయిత మనోజ్ మిత్రా కన్నుమూశారు. 86 ఏళ్ల ఆయన వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన సామాజిక, రాజకీయ అంశాలపై పలు నాటకాలను రాయడంతోపాటు వాటిలో నటించి, దర్శకత్వం కూడా వహించారు. మనోజ్ మృతి పట్ల సీఎం మమతా బెనర్జీ, పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.