AP: బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 5,200 మందికి కోచింగ్ ఇస్తామని మంత్రి సవిత తెలిపారు. బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం చొప్పున సీట్లు కేటాయించామన్నారు. వారితో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 520 సీట్లు అదనంగా కేటాయించామని తెలిపారు. 2 నెలల పాటు కోచింగ్ ఉంటుందని.. కోచింగ్ టైంలో నెలకు రూ.1,500 స్టైఫండ్, మెటీరియల్ కోసం రూ.1,000 ఇస్తామన్నారు.