మృదంగ విద్వాంసుడు కమలాకరరావు మృతి

81చూసినవారు
మృదంగ విద్వాంసుడు కమలాకరరావు మృతి
AP: ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు వరదరావు కమలాకరరావు (88) రాజమహేంద్రవరంలో తుది శ్వాస విడిచారు. పిన్న వయసులోనే మృదంగ విద్వాన్‌గా పేరొందిన ఆయన.. పాల్ఘాట్ మణి అయ్యర్ వద్ద గురుకులవాసం చేశారు. కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడే అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా కేంద్ర పురస్కారం అందుకున్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిలోనూ ఆయన మృదంగ నాదం మార్మోగింది. ఆయన ముగ్గురు కుమారులూ మృదంగ విద్వాంసులుగా రాణిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్