28 కేసుల్లో ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్: డీసీపీ

73చూసినవారు
28 కేసుల్లో ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్: డీసీపీ
TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రిజన్ పబ్ వద్ద కాల్పులు జరిపిన ప్రభాకర్ 2013 నుంచి నేరాలు చేస్తున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. 80 కేసుల్లో నిందితుడు, 28 కేసుల్లో మోస్ట్ వాంటెడ్.. మొత్తం 66 కేసుల్లో అరెస్టు అయ్యాడని తెలిపారు. విశాఖపట్నం జైలు నుంచి ప్రభాకర్ పారిపోయాడని, 2020లో ప్రభాకర్‌ను జైలులో తోటి ఖైదీ వేధించాడంతో ఆ వ్యక్తి హత్యకు ప్లాన్ కూడా చేశాడని పేర్కొన్నారు. అయితే ఆదివారం ఉదయం హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :