భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ చేరుకున్నారు. పోర్చుగల్, స్లొవేకియా దేశాల్లో పర్యటన ముగియడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాత్రి దేశ రాజధానికి చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటన అనంతరం రాష్ట్రపతి ఢిల్లీకి తిరిగి వచ్చారు.
స్లొవేకియాలో ఏప్రిల్ 10న కాన్‌స్టంటైన్ ది ఫిలాసర్ వర్సిటీ ముర్ముకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. ప్రజలకు ముర్ము అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా డాక్టరేట్‌తో గౌరవించింది.