కులం పేరుతో తరతరాలుగా, అన్ని రకాలుగా అణచివేతకు గురైన దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన గొప్ప సంస్కర్త జ్యోతిరావు గోవిందరావు ఫూలే. సామాజిక తత్వవేత్తగా, ఉద్యమకారుడుగా, సంఘ సేవకుడిగా ఫూలే భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా...కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడాడు. నేడు ఆయన జయంతి.