అంటరాని కులాల బాలికల కోసం జ్యోతిబాపూలే పాఠశాలలను స్థాపించారు. 1855లో రాత్రి బడులు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేశారు. స్త్రీ, పురుషుల మధ్య లింగ వివక్షతను జ్యోతిరావు పూలే విమర్శించారు. 1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి స్త్రీలకు అండగా నిలిచాడు. ఇటువంటి కేంద్రం స్థాపించడం దేశంలోనే మొదటిది. వితంతు పునర్ వివాహాలను ప్రోత్సహించారు. ఆయన చేసిన సామాజిక సేవకుగాను 1888లో ముంబైలో జరిగిన సమావేశంలో జ్యోతిరావు పూలేకి మహాత్మా బిరుదు లభించింది.