రోడ్డు మీద వెళ్లేటప్పుడు కొన్ని సార్లు డబ్బులు కనిపిస్తుంటాయి. అయితే ఆ డబ్బులను తీసుకోవాలా.. వద్దా? అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. నిజానికి రోడ్డుపై డబ్బులు కానీ, నగలు కానీ కనిపిస్తే.. అది చాలా విషయాలను సూచిస్తుందని పురోహితులు చెబుతున్నారు. రోడ్డు మీద డబ్బులు కనిపిస్తే.. పూర్వీకుల నుంచి ప్రత్యక్ష ఆశీర్వాదం లభించిందని అర్థం. ఇంకా కొత్త ఉద్యోగం లభిస్తుందని, విజయం, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని అర్థం.