పూణేలోని జంబూర్దాలో 1827 ఏప్రిల్ 11న పూలే జన్మించారు. తన 13వ ఏట సావిత్రిబాయితో వివాహం జరిగింది. 1841-47 మధ్య ఉన్నత విద్యనభ్యసించిన పూలే తన భార్యకి ముందుగా విద్య నేర్పాడు. ఆమె ద్వారా పాఠశాలలు స్థాపించాడు. శ్రమ జీవుల కోసం 1855లోనే రాత్రిబడులు స్థాపించి నిరక్షరాస్యతను పారదోలే దార్శనికుడయ్యాడు. అంటరాని వాళ్ళకు తన ఇంట్లోనే నీళ్ళ బావి నిర్మించి ఔదార్యం చూపాడు. వెలివేయబడ్డ బ్రాహ్మణ స్త్రీలకు, పిల్లలకు ఆశ్రయమిచ్చాడు.