1873 సెప్టెంబర్ 24న 'సత్యశోధక్ సమాజ్' స్థాపించి ఎన్నో సేవలను అందించి మహాత్మునిగా ఘనతకెక్కాడు జ్యోతిరావు పూలే. ఆయన బిసి 'మాలి' కులానికి చెందిన వాడవడం వల్ల తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో కులవివక్షకు గురయ్యాడు. ఆ క్షణం నుండి కుల వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. కుల విధానంలో బ్రాహ్మణవాదాన్ని విమర్శించడమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వకపోవడంపై అభ్యంతరం తెలిపాడు.