క్ష‌మాప‌ణ‌లు కోరిన బ్రిట‌న్ ప్ర‌ధాని

79చూసినవారు
క్ష‌మాప‌ణ‌లు కోరిన బ్రిట‌న్ ప్ర‌ధాని
డీ డే సంబ‌రాల నుంచి అర్ధాంత‌రంగా వెళ్లిపోయినందుకు బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్ క్ష‌మాప‌ణ‌లు కోరారు. త‌ప్పు జ‌రిగిన‌ట్లు ఆయ‌న అంగీక‌రించారు. ఫ్రాన్స్‌లోని నార్మాండీలో జ‌రుగుతున్న డీ డే సెల‌బ్రేష‌న్‌లో పాల్గొనేందుకు వెళ్లిన రిషి సునాక్‌.. అక‌స్మాత్తుగా ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌కుండానే మ‌ళ్లీ స్వ‌దేశానికి ప‌యనం అయ్యారు. అయితే ఓ టీవీకి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో రిషి సునాక్ క్ష‌మాప‌ణ‌లు కోరారు.

ట్యాగ్స్ :