పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన సమాధి శాంతి వనాన్ని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకాగాంధీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ప్రజల్లో భయాన్ని పెంచే వ్యక్తులు నిజమైన ప్రజాప్రతినిధులు కాలేరన్నారు. దశాబ్దాల పోరాటం, లెక్కలేనన్ని త్యాగాల తర్వాత మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు అమాయక ప్రజలను భయపెట్టి తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేసేవారు ఇప్పటికీ ఉన్నారని తెలిపారు.