శ్రీహరికోటలో సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి ఎగిరేందుకు పీఎస్‌ఎల్‌వీ-సీ60 సిద్ధంగా ఉంది. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి 25 గంటలపాటు కౌంట్‌డౌన్ నిర్వహించేలా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఆదివారం రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నారు. రాకెట్ నాలుగు దశలతో పాటు ఉపగ్రహాల అనుసంధాన పనులను ఇప్పటికే శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఈ రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్‌కు చెందిన స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను రోదసిలోకి ఇస్రో పంపనుంది.