కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు వృత్తి పనివారల ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన సుమారు 9 నిమిషాల వీడియోను ‘X’లో షేర్ చేశారు. ఢిల్లీలో మట్టి ప్రమిదలను తయారు చేసే మహిళ ఇంటికి రాహుల్ గాంధీ వెళ్లి, ప్రమిదలను సొంతంగా తయారుచేసేందుకు ప్రయత్నించారు. వీటిని తన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియంకా గాంధీ వాద్రాకు ఇస్తానని తెలిపారు.