హైదరాబాద్‌లో వర్షం.. వాహనదారులకు ఇక్కట్లు

79చూసినవారు
హైదరాబాద్‌లో వర్షం.. వాహనదారులకు ఇక్కట్లు
హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదర్‌నగర్‌, కేపీహెచ్‌బీ, మియాపూర్‌, గచ్చిబౌలి తదితర చోట్ల భారీగా వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో రోడ్లపైనే నీరు నిలిచిపోయింది. మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్