తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేడు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, ఖమ్మం, మెదక్, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.