‘గోదారి గట్టుమీద రామసిలకవే’.. పాట వచ్చేసింది

54చూసినవారు
వెంకటేశ్‌ కథానాయకుడిగా... అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ సినిమాలోని ‘గోదారి గట్టుమీద రామసిలకవే... గోరింటాకు ఎట్టుకున్న సందమామవే...’ అంటూ సాగే పాటని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చగా, రమణ గోగుల, మధుప్రియ ఆలపించారు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ కానుంది.

ట్యాగ్స్ :