పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటన చేశారు. ఈసారి శని, ఆది వారాల్లోనూ పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ మేరకు లోక్ సభలో ఆయన వెల్లడించారు. సభా కార్యక్రమాలు సజావుగా జరగనందున శని, ఆది వారాల్లో కూడా పార్లమెంట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాగా.. గౌతమ్ అదానీ అంశంపై చర్చ జరపాలంటూ లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేసి వాకౌట్ చేశారు.