అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మిలిటెంట్ సంస్థ హమాస్ పై విరుచుకుపడ్డారు. తమ చెరలోని బందీలకు సంబంధించిన వీడియోను ఇటీవల హమాస్ విడుదల చేసింది. దీనిపై స్పందిస్తూ.. 'నేను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తాను. అంతవరకు బందీలను విడుదల చేయాలి. లేకపోతే ఈ దురాగతాలకు పాల్పడేవారికి నరకం చూపిస్తాను. చరిత్రలో చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని హెచ్చరించారు.