రుణమాఫీపై సంబరాలు

64చూసినవారు
ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రైతు రుణమాఫీ అమలుపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని హస్తం పార్టీ నేతలు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. గురువారం రూ. 1లక్ష రుణమాఫీ అమలుపై సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. నియోజకవర్గంలో అర్హులైన రైతులందరికి రుణమాఫీ అమలు చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. ప్రతిపక్షాలు, పట్టని నేతలు చెప్పే మాటలు నమ్మొద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్