తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్ వన్ లో స్పోర్ట్ కోట కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని మంగళవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 న వెరిఫికేషన్ ఉండనుండగా 25న రాలేని వారికి 27న అవకాశం కల్పించింది. గ్రూప్-I సర్వీస్‌లలో స్పోర్ట్స్ రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేసిన అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది.