తెలంగాణ అసెంబ్లీ వద్ద అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాను బుధవారం కలిశారు. తెలంగాణలో ఉన్న జనాభా దామాషా ప్రకారం రజకులను ఎస్సీ జాబితాలోకి చేరుస్తామని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని, రజకుల సమస్యల మీద అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వినతిపత్రం వారికి అందజేశారు.