ఏపీకి కేంద్రం శుభవార్త.. కొత్త ఫిషింగ్ హార్బర్

83చూసినవారు
ఏపీకి కేంద్రం శుభవార్త.. కొత్త ఫిషింగ్ హార్బర్
ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. కొత్తగా ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సాగరమాల 2.0 కార్యక్రమం కింద ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం 40 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా. రూ.400 కోట్ల వ్యయంతో కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ రూపుదిద్దుకోనుంది.

సంబంధిత పోస్ట్