కరాటే శిక్షణలతినే విద్యార్థులకు శారీరక, మానసిక వికాసం

76చూసినవారు
కరాటే శిక్షణలతినే విద్యార్థులకు శారీరక, మానసిక వికాసం
ఫరూక్ నగర్ మండలంలోని వెల్జర్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల ఆత్మరక్షణ కోసం కుంగ్ ఫు, కరాటే క్లాసులు ప్రారంభమయ్యాయి. అహ్మద్ మాస్టర్ (బ్రూస్ లీ) ఆధ్వర్యంలో ఈ శిక్షణలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కుంగ్ ఫు, కరాటే వంటి శిక్షణలు బాలికల శారీరక మరియు మానసిక వికాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇలాంటి ఆటలు, క్రీడల పట్ల ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్