భారీ వర్షాలు పడుతన్నాయి. హైదరాబాద్లో వర్షాలు దంచికొడుతుండటంతో జంట జలాశయాల గేట్లను జలమండలి అధికారులు ఎత్తారు. వరద వస్తుండటంతో ఉస్మాన్ సాగర్ 2 గేట్లు, హిమాయత్ సాగర్ ఒక గేటు ఎత్తివేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బల్దియా అప్రమత్తం చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండా లని అధికారులు సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో శనివారం అధికారులు ఈరెండు జలాశయాల గేట్లు ఎత్తివేశారు.