
రాజేంద్రనగర్: గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలలో ఆటల పోటీలు
రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని బుద్వేల్ నేతాజీ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాటల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. బాలకృష్ణ తెలిపారు. విజేతలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు.