రాజేంద్రనగర్: రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన

51చూసినవారు
రాజేంద్రనగర్: రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలనను రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజేంద్రనగర్ లో జరుగుతున్న కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్, సులేమాన్ నగర్, శాస్త్రీపురం డివిజన్లకు చెందిన మొత్తం 7 వేల దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.