సంక్రాంతి పర్వదినం సందర్బంగా రంగురంగుల రంగవల్లులు ఆకట్టుకున్నాయి. రకరకాల ముగ్గులు చూడముచ్చటగా అనిపించాయి. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి పట్టణంలో సోమవారం ముగ్గుల పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలకు మహిళలు, యువతులు, విద్యార్థినిలు తరలివచ్చి రంగురంగుల ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలో విజేతలుగా నిలిచిన వారికి నగదుతో పాటు బహుమతులు ప్రధానం చేశారు.