రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోగల కొత్తూరు మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన అనితకు సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కును బుధవారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అందజేసినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.