షాద్ నగర్: సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కౌన్సిలర్
షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు సోలిపూర్ గ్రామంలో శనివారం కౌన్సిలర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కృష్ణవేణి మాట్లాడుతూ 5 లక్షల రూపాయల నిధులతో గ్రామంలోని సంజీవ ఇంటి నుంచి కావలి అమృత ఇంటి వరకు ఈ సీసీ రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పులిమామిడి శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.