షాద్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి యుగందర్ సాయం చేయాలన్న సంకల్పంతో ఏకంగా రూ. 25 లక్షలు దారదత్వం అందజేసి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. గురువారం ఈ మొత్తాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు అందజేశారు. షాద్‌నగర్ పట్టణంలో శిథిలమైపోయిన పాత ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థానంలో నూతనంగా భవనాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంకల్పించిన సంగతి తెలిసిందే.