గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

64చూసినవారు
గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగుడా మండల పరిధిలోని ఇంద్రనగర్ లో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, సర్పంచ్ మహబూబ్ బీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ఉపసర్పంచ్ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్