

ప్రియురాలితో ఉండగా చూశాడని బాలుడిని దారుణంగా చంపేశాడు (వీడియో)
తమిళనాడులోని కృష్ణగిరిజిల్లాలో 13 ఏళ్ల బాలుడి కిడ్నాప్, హత్యకు సంబంధించి పోలీసుల విచారణలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. పోలీసులు తెలిపిన ప్రకారం.. మహాదేవన్ తన ప్రియురాలితో ఉన్నప్పుడు రోహిత్ అనే బాలుడు చూశాడు. దీంతో మహాదేవన్ తన స్నేహితుడితో కలిసి రోహిత్‌ను కారులో కిడ్నాప్ చేసి బాలుడి నోటిలో బీరు పోసి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం బాలుడిని 50 అడుగుల లోతైన గుంతలో విసిరి దారుణంగా హత్య చేశారు.