షాద్ నగర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత యువ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు జాంగారి రవి నేతృత్వంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చల్లా శ్రీకాంత్ రెడ్డి, పినపాక ప్రభాకర్, బాలరాజ్ గౌడ్, మీడియా ప్రతినిధులు, కావలి జగన్, జాంగారి జంగయ్య, దేవగిరి కృష్ణ, తదితరులు హాజరయ్యారు.