షాద్ నగర్ నియోజకవర్గం జహంగీర్ పీర్ దర్గాను అభివృద్ధి చేసింది తామేనని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ దర్గాలు కనీస వసతులు కూడా కరువైన సమయంలో తాము అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సమయంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు.