లిఫ్ట్ ఇస్తానని యువతిపై అత్యాచారయత్నం

327193చూసినవారు
లిఫ్ట్ ఇస్తానని యువతిపై అత్యాచారయత్నం
హైదరాబాద్ తార్నాకలో వారం రోజుల కిందట జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. లిఫ్ట్ పేరుతో బైక్ ఎక్కించుకుని ఆర్తి అనే యువతిపై శ్రీధర్ అనే వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆమె బైక్ నుంచి దూకేసింది. వెనుకే వస్తున్న లారీ కింద పడిపోయింది. తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్