ఆగస్టు 19న ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఆరోజు మధ్యాహ్నం 2.26 గంటలకు అరుదైన 'సూపర్‌మూన్ బ్లూ మూన్' కనిపించనుంది. ఈ ఏడాది వరుసగా నాలుగు సూపర్‌మూన్‌లు కనిపించనుండగా, ఇదే మొదటిది. చంద్రుడు భూమికి 90% దగ్గరగా ఉండడాన్ని ‘సూపర్‌మూన్’ అంటారు. ఇక బ్లూ మూన్ అనగా, ఒక నెలలో రెండోసారి వచ్చే రెండు ఫుల్ మూన్‌లలో రెండవది అని అర్థం.