కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అరుదైన అడవి జాతి శునకాలు ప్రత్యక్షమయ్యాయి. అంతరించిపోతున్న ఈ ఇండియన్ వైల్డ్ డాగ్స్ తాజాగా పెంచికల్ పేట్ అడువుల్లో కనిపించాయి. కమ్మర్గాం- మురళిగూడ మధ్య అటవీ ప్రాంతంలోని చెరువు వద్ద నీరు తాగుతూ మూడు ఇండియన్ వైల్డ్ డాగ్స్ స్థానిక యువకుల కెమెరాకు చిక్కాయి. పెంచికల్ పేట్ రేంజ్ పరిధిలో సుమారుగా 5-10 ఏషియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెప్పారు.