AP: రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇవాళ కలెక్టరేట్‌లో మంత్రి మాట్లాడారు. రథసప్తమికి రెండు రోజుల ముందు నుండే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతీ పాస్‌పై క్యూఆర్ కోడ్ తప్పనిసరి అని ఆదేశించారు. డోనర్లు, రూ.500 టికెట్, ఉచిత దర్శనం వారికి డిసిఎమ్ఎస్ నుండి, విఐపిలకు ఆలయ ముఖద్వారం నుండి ప్రవేశం కల్పించాలని చెప్పారు. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేయాలన్నారు.