కాన్పూర్‌లో జరిగే భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు ముందు భారతీయ స్పిన్ మాస్టర్ రవిచంద్రన్ అశ్విన్ పలు రికార్డులకు చేరువలో ఉన్నాడు. అశ్విన్ ఒక వికెట్ తీస్తే టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్‌లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా నిలవనున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 సైకిల్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచేందుకు అశ్విన్ మరో 4 వికెట్లు తీస్తే సరిపోతుంది.