TG: తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కేసు పెడితే పెట్టుకోండి.. అరెస్ట్ చేస్తే చేసుకోండి. జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నా. నన్ను జైల్లో పెట్టి రేవంత్ పైశాచిక ఆనందం పొందుతానంటే సిద్ధంగా ఉన్నాను. 2, 3 నెలలు జైల్లో ఉంటా.. వచ్చి పాదయాత్ర మొదలుపెడతా' అంటూ హాట్ కామెంట్స్ చేశారు.