నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అక్కడి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాయర్స్‌తో ముచ్చటించారు. ఏఐ లాయర్‌ను పరీక్షించేందుకు మరణశిక్ష రాజ్యాంగబద్దమేనా? అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ప్రశ్నించగా అవునంటూ ఏఐ లాయర్ సమాధానమిచ్చింది. మరోవైపు రేపు చంద్రచూడ్ సీజేఐగా చివరి రోజు కానుంది.