దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విమానయాన సంస్థ లిక్విడేషన్ ప్రక్రియకు గురువారం ఆదేశాలిచ్చింది. దివాలా పరిష్కార ప్రయత్నాలు విఫలమవడంతో.. రుణదాతలు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఆర్థిక కష్టాల నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్ సంస్థ 2019లో తన కార్యకలాపాలు నిలిపివేసింది.