హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీచేశారు. ఈ క్రమంలో నగరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై ఏర్పడ్డ గుంతలతో ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజలకు అత్యవసరమైతే 040 21111111, 9000113667 నెంబర్‌ల ద్వారా సంప్రదించాలని తెలిపారు.