రెరా కార్యదర్శి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు

570చూసినవారు
రెరా కార్యదర్శి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు
HMDA మాజీ డైరెక్టర్, రెరా కార్యదర్శి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. శివబాలకృష్ణ మెట్రోరైల్ ఛీప్ జనరల్, రెరా ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు.