మైదాను ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మలబద్దకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. మైదాను తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. మోతాదుకు మించి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ పేషెంట్స్ కూడా మైదాకు పూర్తిగా దూరంగా ఉండాలి.