కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. ఇటీవల మహారాష్ట్రలో పర్యటించిన మోదీ కర్ణాటకలో కాంగ్రెస్ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు లిక్కర్ వ్యాపారుల నుంచి రూ.700 కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ ఆ ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. నిరూపించకపోతే మోదీ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారా? అని సవాల్ విసిరారు.