‘సై’ సినిమాలో వేణుమాధవ్ కామెడీ ట్రాక్‌ను ఎవరూ మర్చిపోలేరు. స్టూడెంట్స్‌ను బెదిరిస్తూ ‘నల్లబాలు.. నల్లత్రాచు లెక్క.. నాకి చంపేస్తా’ అంటూ డైలాగ్‌లు చెబుతుంటే రాజమౌళి పడిపడి నవ్వారు. ‘ఈ కామెడీ ట్రాక్ పెంచితే సినిమాకు మంచి మైలేజీ వస్తుంది’ అని ఎవరో రాజమౌళికి సలహా ఇవ్వడంతో ఏసీపీ అరవింద్, భిక్షు యాదవ్‌లను బెదిరించే సన్నివేశాలను తీశారు. అలా ఒక్క సీన్ అనుకుంటే మూడు సీన్లు అయ్యాయి. ఈ సీన్లు మీరూ చూసేయండి.