అందవచ్చిన క్యాచ్‌ను వదిలేయడంతో కేఎల్ రాహుల్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సిరాజ్ వేసిన 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లేథమ్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. అలర్ట్‌గా లేని కేఎల్ రాహుల్ కనీసం క్యాచ్ కోసం ప్రయత్నించలేదు. తన క్యాచ్ కాదంటూ రియాక్షన్ ఇచ్చాడు. దీంతో రోహిత్ తీవ్ర ఆగ్రహానికి గురై గట్టిగా అరుస్తూ అసహనం వ్యక్తం చేశాడు.